అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. షాక్ లో ఫ్యాన్స్..!!

-

కేరళకు చెందిన అమ్మాయే అయినప్పటికీ మలయాళం కంటే తెలుగును చాలా స్పష్టంగా పలకడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ముఖ్యంగా బుల్లితెర పైన బోలెడన్ని ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూనే సినిమా ఫంక్షన్స్ కు హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇక తనదైన శైలిలో వాగ్దాటితో సెలబ్రిటీలను మెప్పిస్తూ పంచులు కూడా వేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. సుమ తెలుగును స్పష్టంగా పలికే తీరును అప్పట్లో భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా మెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి వివాహం చేసుకుంది.

తన కెరియర్ మొదట్లో సినిమాలలో, సీరియల్స్ లో నటించిన సుమ ఆ తర్వాత నటనకు స్వస్తిపలికి యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక ఎప్పటికప్పుడు భాషపై పట్టు సాధించి .. సరదాగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా సుమ ఒక అంత చిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వ్యాధి గురించి సుమ ఇటీవల బయటపెట్టింది. తను యూట్యూబ్ ఛానల్ లో ఆ వ్యాధి గురించి అసలు విషయం షేర్ చేసింది. ఇక గత కొన్ని సంవత్సరాలు నుంచి ఒక రకమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నానని సుమ తెలిపింది.

కీలాయిడ్ టెండెన్సీ అనే అరుదైన చర్మ వ్యాధితో తాను సతమతమవుతున్నట్లు తెలిపింది.కీలాయిడ్ టెండెన్సీ అంటే చర్మంపై ఒక చోట గాయం అయితే ఆ గాయం మరింత పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉంటుందట. ఇక ఆ గాయాన్ని తగ్గించుకోవడానికి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక ఈ నేపథ్యంలోని తగ్గని జబ్బు గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడే కన్నా సమస్యను అలవాటు చేసుకొని.. తన లైఫ్ లో బిజీగా అవ్వడమే చాలా సంతోషంగా ఉంది అని సుమ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version