తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. ఇక అనధికార లే-అవుట్లలోనూ రిజిస్ట్రేషన్లు

-

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది హై కోర్టు. ఇక అనధికార లే-అవుట్లలోనూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తాజాగా తీర్పు ఇచ్చింది కోర్టు. అనధికార లే-అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు నిన్న కీలక తీర్పు ఇచ్చింది. అనధికార లేఅవుట్ల ప్లాట్లనూ షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 5 వేలకు పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే… వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు… షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని డాక్యుమెంట్లో రాయాలని.. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఈసీ, వెబ్ సైట్ లోనూ పేర్కొనాలని హైకోర్టు తెలిపింది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, 30 అడుగుల రోడు లేని ప్లాట్ల కొనుగోళ్లపై హెచ్చరించాలని.. చట్ట ఉల్లంఘనలపై కొనుగోలుదారులదే బాధ్యత అని డాక్యుమెంట్ లో రాయాలని హైకోర్టు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news