ఏపీ హై కోర్టులో జనసేనకి చుక్కెదురు..!

-

గాజు గ్లాసు గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు గ్లాసు గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది.

టీడీపీ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ అని, ఈ గుర్తును ఏపీ వ్యాప్తంగా కేవలం జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని, అందుకు సమయం మించిపోయిందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలై కొనసాగుతోందని, గుర్తుల కేటాయింపు కూడా జరిగిందని, ఇతరులకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ వెల్లడించింది. పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. అనంతరం, ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version