భీమవరంలో ఏప్రిల్ 16న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ‘మోడల్ కోడ్ కి విరుద్ధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై టీడీపీ కూడా మరోమారు సీఈవో మీనాకు ఫిర్యాదు చేసింది. మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగిన సమయంలో సీఐ భక్తవత్సల రెడ్డి అక్కడే ఉన్నారు. ఆయనను ఎన్నికల విధుల్లో ఉంచకూడదు. సీఐ లక్ష్మణ్ అధికార పార్టీకి సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి అధికారులు విధుల్లో ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగవు. చిత్తూరులో సీఐ గంగిరెడ్డి .. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.