45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు : జగన్

-

వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన.. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక పాలన కొనసాగుతోందని.. మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

వైసీపీ సానుభూతి పరులపై దాడులు పెరుగుతున్నాయి. టీడీపీ వాళ్లు ఏం చేసినా పోలీసులు ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్న నీచ సంస్కృతి మన రాష్ట్రంలో నెలకొంది. 45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడులకు నిరసనగా ఈనెల 24న బుధవారం రోజు ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రధాని మోడీని కూడా కలుస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news