పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు..స్పాట్‌ లోనే నలుగురు మృతి !

-

Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో గీతిక స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీకొట్టింది ఓ కారు.

A car collided with a tree in Palnadu district

దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగు రు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హా స్పిటల్ తరలించారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం చేసుకొని కావలి వెళ్తున్న కారుకు ఈ ప్రమాదం జరిగింది. కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు ఆంజనేయ స్వామి మాలధారణ లో ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version