కోనసీమ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతున్నారు. పసి పిల్లలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. దేశం లో ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నా దగ్గర చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లి లోవేములపల్లి లో చోటుచేసుకుంది.

రామకృష్ణ పౌల్ట్రీ ఫారం లో పనిచేస్తున్న నిందితుడు రమణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదే పౌల్ట్రీ ఫారంలో ఓ వృద్ధ దంపతులు పనిచేస్తుంటారు. వారి వద్దకు ఆడుకోవడానికి వచ్చిన చిన్నారి (4 సంవత్సరాలు) బలవంతంగా పౌల్ట్రీ ఫారం లోకి తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో , ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.