పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను కొన్ని గుర్తు తెలియని వాహానాలు వెంబడిస్తోన్నాయని సమాచారం. దీంతో పవన్ ఇంటి వద్ద వాహానాలు తిరుగుతున్నాయని జనసేన నేతల ఆందోళనకు దిగారు. గత రెండు, మూడు రోజుల నుంచి పవన్‌ను ఆగంతకులు వెంబడిస్తోన్నారు. అంతే కాదు హైదరాబాదులోని పవన్ ఇంటి వద్ద కారు ఆపి సెక్యూర్టీతో గొడవ పడ్డారు ఆ ఆగంతకులు.
దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్.వీడియో రికార్డింగ్సుతో సహా ఫిర్యాదు చేశారు శంకర్ గౌడ్. పవన్ కళ్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారు.విశాఖ సంఘటన తరువాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పద వ్యక్తులు తచ్చాడుతున్నారు.పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని అటు నాదెండ్ల మనోహర్ కూడా పేర్కొన్నారు.