Akbaruddin Owaisi Powerful Speech In Assembly Session : అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 ఏండ్లలో ఇంత అధ్వానంగా అసెంబ్లీ జరగడం నేను చూడలేదన్నారు ఒవైసీ. 25 ఏండ్ల నా అనుభవంలో ఇలా సభ జరగడం నేను ఎప్పడు చూడలేదని బాంబ్ పేల్చారు అక్బరుద్దీన్ ఒవైసీ.
ఒక్క పొలిటికల్ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదనితెలిపారు. అందరిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు అక్బరుద్దీన్ ఒవైసీ. ప్రతి రోజు మాకు ఎజెండా 1:00 గంటకు వస్తుంది.. మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చింది.. అప్పుడు వస్తే సబ్జెక్ట్ మీద మేము ప్రిపేర్ ఎప్పడు కావాలని చురకలు అంటించారు అక్బరుద్దీన్ ఒవైసీ.