తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయినా న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిందేనని తెల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి సీఎం అయినా న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిందే.. ఎంతటి వాడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడని హెచ్చరించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.
అటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని…రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను అభిమానించే వ్యక్తిని అని కొనియాడారు. నా రాజకీయ ప్రయాణం షర్మిల తోనేనని స్పష్టం చేశారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేను ఉంటానని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.