ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కూటమి నేతలు తాజాగా కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖను అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గవర్నర్ ను కలిశారు.
ఇక మరోవైపు విజయవాడలో మంగళవారం ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి నేతలు గవర్నర్ ని కలిసి కోరారు. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించగా.. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. వీరితో పాటు మూడు పార్టీల ఎమ్మెల్యేల అభ్యర్థులు చంద్రబాబు సీఎం అభ్యర్థి అని ఆమోదించారు.