ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఓవైపు అమరావితియే రాజధానిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తోంటే.. మరోవైపు వైసీపీ మాత్రం విశాఖ రాజధానిగా కార్యకలాపాలు కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చుంది. ఈ విషయం కోర్టు ఆదేశాలను కూడా వైసీపీ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతి అంశం ఇవాళ సుప్రీం కోర్టులో ప్రస్తావనకు రానుంది. ఈ అంశానికి సంబంధించిన కేసులు త్వరితగతిన విచారణ జాబితాలో చేర్చాలంటూ సుప్రీం కోర్టులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ ప్రస్తావిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేశారు.