నేను వారి పేర్లను గ్రీన్ బుక్ లో రాసుకుంటా : అంబటి రాంబాబు

-

ప్రతిపక్షం లో కార్యకర్తలకు అండగా పనిచేయడం ఒక అదృష్టం. గుంటూరు వైసిపి నీ రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా చేస్తా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.జగన్ ఆదేశాలతో నే నేను జిల్లా అధ్యక్షుడు గా భాద్యతలు తీసుకున్నాను. ఇది పదవి కాదు. జగన్ అప్పగించిన బాధ్యత. ప్రతి కార్యకర్తకు అండగా నేను ఉంటాను. ఎన్నికల లో గెలుస్తాం అనుకున్న స్థానాలు ఓడిపోయామ్. భారీ మెజార్టీ ల తో ఓడిపోయామ్. దానికి కారణాల పై అనేక అనుమానాలు ఉన్నాయి. పదవులు వచ్చినా, పోయిన లెక్క చేయను. నాయకులను అందర్నీ కలుపుకొని టిడిపి నీ ఓడించడమే నా ధ్యేయం.

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది. నేను వైసిపి కార్యకర్తల పనితనాన్ని గ్రీన్ బుక్ లో రాసుకుంటా… వైసిపి అధికారం లోకి వచ్చాక గ్రీన్ బుక్ లో పేరు ఉన్న ప్రతి కార్యకర్తకు మేలు చెపిస్తా. టిడిపి కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో పడవల రాజకీయం చేసిన ప్రభుత్వం ఇది. పడవలు పెట్టి బ్యారేజి పగల కొట్టే కుట్ర జరిగందని దుష్ప్రచారం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు పై దుష్ప్రచారం చేసిన వాల్ల కు కలియుగ దైవం ఖచ్చితం గా శిక్ష వేస్తారు. వంద రోజుల్లోనే చంద్రబాబు పాపాలు బయట పడుతున్నాయి అని అన్నారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version