BREAKING : అనకాపల్లిలో గ్యాస్ లీక్‌..100 మందికి పైగా

-

BREAKING : అనకాపల్లిలో గ్యాస్ లీక్‌..100మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లిజిల్లా అచ్చుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీక్‌ అయింది. ఈ నేపథ్యంలోనే ఘాటు వాయువులు రావడంతో పలువురు కార్మికులు… స్పృహ కోల్పోయారు. ముఖ్యంగా క్వాంటం సీడ్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న మహిళ కార్మికులపై అధిక ప్రభావం పడినట్లు సమాచారం అందుతోంది.

అలాగే 100మందికి పైగా వాంతులు, తలతిరగడంతో స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక సమాచారం అందుతోంది. సమీపంలోని కెమికల్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని అనుమానం చేస్తున్నారు. ఇక ఈ సంఘటన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news