అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నారు. రాష్ట్ర విభజన హామీలు, రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, సీఎం జగన్ రెండో రోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా సాగిన సీఎం పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు.

సీఎం జగన్- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
సీఎం జగన్- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ఈ మేరకు భేటీలో పోలవరం ప్రాజెక్ట్ పై ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే రెవెన్యూ లోటు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికపై, మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు విషయాలపై సీఎం జగన్ అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. అయితే ఢిల్లీ మొదటి రోజు పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ప్రధానితో కూడా 45 నిమిషాలపాటు మాట్లాడారు. పోలవరం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని మెమొరాండం ఇచ్చారు.