కోర్ట్ ధిక్కరణకు పాల్పడిన అధికారులకు హైకోర్ట్ జైలు శిక్ష విధించింది. 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్ట్ 2 వారాల పాటు జైలు శిక్ష విధించింది. హైకోర్ట్ ఆదేశాలను పాటించని ఐఏఎస్ లపై ఈచర్యలు తీసుకుంది. అయితే ఐఏఎస్ లు క్షమాపణలు చెప్పడంతో… జైలు శిక్షను రద్దు చేసి, సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమ హాస్టళ్లలో ప్రతీ నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది. ఒక రోజు కోర్ట్ ఖర్చులను భరించాలని హైకోర్ట్ ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసినా… అధికారులు పాటించలేదు. దీంతో ఈచర్య కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుంది హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామలా రావు, గోపాల క్రిష్ణ ద్వివేది, శ్రీ లక్ష్మీ, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్ లకు కోర్ట్ ఆదేశాలు అమలు చేయకపోవడంతో కోర్ట్ ధిక్కరణగా హైకోర్ట్ భావించింది.
8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష.. కోర్ట్ ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్ట్ తీర్పు
-