టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. శనికి మరో రూపమే చంద్రబాబు అని.. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమేనని విమర్శించారు. రెండు సభల పేరుతో చంద్రబాబు 11 మంది అమాయక ప్రజలను బలిగొన్నాడని విమర్శించారు. కానుకలు ఇస్తామని పది రోజుల నుండి ప్రచారంతో ఊదరగొట్టి.. ఒక్కో మహిళకు మూడు చీరలు ఇస్తామని చెప్పి 50 వేల టోకెన్లు పంచారని అన్నారు. కానుకలు, చీరలు ఇస్తామని దొంగ మాటలు చెప్పి ముగ్గురిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.
ఈ మరణాలకి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుందన్నారు. చంద్రబాబు కి సిగ్గు, శరం లేదని.. అధికారంలోకి రావడానికి ఎవరిలా చచ్చినా చంద్రబాబుకి అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.