BREAKING : ఏపీలో మరో కోడి కత్తి దాడి.. ఓ యువతి పై దాడి

-

BREAKING : ఏపీలో మరో కోడి కత్తి దాడి.. చోటు చేసుకుంది. కోడి కత్తితో యువతి పై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఇక అడ్డువచ్చిన ఆమె తల్లిపై ఇనుపురాడ్డు తో దాడి చేశాడు ఆ దుండగుడు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలో ఈ ఘటన జరిగింది.

murder
murder

నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ బాధితురాలు వెంటపడుతున్నాడు రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం కి చెందిన చేపల నానాజీ. ఆమె నిరాకరించడంతో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాలలో ఆమె ఫోటోలు పెట్టి తన భార్యగా ప్రచారం చేశాడు.

 

గతంలో యువతి పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై ఇబ్బంది పెట్టను అని 2020 మార్చి 24న లికిత పూర్వకంగా రాసి ఇచ్చాడు యువకుడు.అయినప్పటికీ మారకుండా ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు యువకుడు. ఇక బుధవారం రాత్రి యువతీ ఇంటికి వచ్చి యువకుడు హల్చల్ చేశాడు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news