ఏపీలో మ‌రో ఓమిక్రాన్ కేసు.. మొత్తం 17

-

దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరుల వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ రోజు మ‌రో ఓమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. విదేశాల నుంచి ప్ర‌కాశం జిల్లా కు వ‌చ్చిన ఒక వ్య‌క్తి ఓమిక్రాన్ వేరియంట్ బారీన ప‌డ్డాడ‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 17 కు చేరింది. అలాగే ప్ర‌కాశం జిల్లా వ్య‌క్తి తో పాటు మొత్తం 14 మంది విదేశాల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ కు చేరుకున్నార‌న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారికి క‌రోనా నిర్ధార‌ణ కోసం ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. నెగిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే 17 ఓమిక్రాన్ వేరియంట్ కేసుల నుంచి 3 ముగ్గురు ఓమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version