త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు: సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ మోటర్లకు మీటర్లను బిగించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతోందని సీఎం జగన్ అన్నారు. 

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తం అన్ని జిల్లాల్లో వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతోందన్నారు సీఎం. రాజకీయ లబ్ధి కోసమే మీటర్ల ఏర్పాటుపై దుష్ఫ్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. దీన్ని తిప్పి కొట్టి జరుగుతున్న మేలును రైతులకు వివరించాలని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా విమర్శలు గుప్పించింది. తెలంగాణ మంత్రులు శ్రీకాకుళంలో మోటర్లకు మీటర్లను అమర్చారని… మోదీ ఆదేశాల మేరకే జగన్ ఇలా చేశారంటూ విమర్శించారు.