మస్ట్ రీడ్: బాబు ఫైల్ చూపించిన జగన్… అవాక్కయిన అమిత్ షా!!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో జగన్ భేటీకి గల కారణాలు “కేంద్ర కేబినెట్లోకి వైసీపీ” అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే అది ఇంకా క్లారిటీకి రాలేదని, అలాంటి ఆప్షన్ పూర్తి వాస్తవం కాదని చెప్పుకొస్తున్నారు వైకాపా నేతలు! అయితే.. జగన్ వరుసగా రెండు సార్లు అమిత్ షా తోను, 10రోజుల వ్యవధిలో ప్రధానితోనూ అవుతున్న భేటీల వెనక అత్యంత కీలక విషయం ఒకటుందని అంటున్నారు!

అవును… ప్రస్తుతం జగన్ ఫైల్స్ పట్టుకుని, కోర్కెల చిట్టా చేతపట్టుకుని హస్తినలో వరుసగా భేటీలు అవుతున్నది కొన్ని అతిముఖ్యమైన పనుల వల్ల!! అమ‌రావ‌తి భూ కుంభకోణాలు, ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇత‌ర స్కాం ల‌కు సంబంధించి పూర్తి ఆధారాల‌ ఫైల్ తో హస్తిన చేరిన జగన్.. ఆ ఫైల్ కు సంబందించిన విషయాలు అమిత్ షాతో వ‌ర‌స‌గా రెండు రోజుల పాటు జరిగిన భేటీలో వివరించారంట!

చంద్ర‌బాబు నాయుడు స్కాం లు, ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డానికి ఉన్న ప్రతీ అవ‌కాశాన్నీ జ‌గ‌న్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకి విశ‌దీక‌రించార‌ని.. ఈ స్కామ్ ల లిస్టుతో అమిత్ షా అవాక్క‌య్యారని.. ఈ అంశం గురించి ప్ర‌ధానికి కూడా ఒక‌సారి వివ‌రించాల‌ని జ‌గ‌న్ కు షా సూచించారని తెలుస్తోంది!!  మరి ఈ విషయాలన్నీ పూర్తిగా వాస్తవాలే అయితే… బాబు – చినబాబులు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడానికి పెద్ద ఎక్కువ సమయమేంఈ పట్టకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు!

-CH Raja