ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.. త్వరలోనే పెండింగ్ డిఏ జమ చేయనున్నట్లూ జగన్ సర్కార్ ప్రకటించింది. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య వల్ల జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్-డెబిట్ లావాదేవీలు జరిగాయన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జీపీఎఫ్ ఖాతాల గందరగోళంపై నివేదిక ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్….డీఏ బకాయిల బిల్లులు ఆమోదం పొందకుండానే పొరపాటున జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు జమయ్యాయని పేర్కొంది.
బిల్లుల ఆమోదం పొందకుండా నిధులు జమయ్యాయి కాబట్టి.. ఆ నిధులను వెనక్కు తీసుకున్నట్టు స్పష్టం చేసింది జగన్ సర్కార్. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు పెండింగులో ఉన్నాయన్న ప్రభుత్వం…త్వరలోనే పెండింగ్ డీఏలను చెల్లిస్తామని స్పష్టం చేసింది. కాగా జిపిఎస్ ఖాతాల్లో నిధులు… కాజేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు నిన్న మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారుపై తమకు నమ్మకం పోయిందని ఏపీ ఉద్యోగులు తమ గోడును వెల్లడించారు.