ఏపీ అంటే అమరావతి, పోలవరం : సీఎం చంద్రబాబు

-

5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా అన్నారు సీఎం చంద్రబాబు. తాజాగా అమరావతిలో పర్యటించి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం అని పేర్కొన్నారు సీఎం. పోలవరం పూర్తి చేస్తే.. రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రైతులు 1,631 రోజులు ఆందోళన చేశారు. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించింది. రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన పోలవరం ఒక వ్యక్తి వల్ల శాపంగా మారింది. అమరావతి ఏ వ్యక్తికో.. ఒక సామాజిక వర్గానికో సంబంధించినది కాదన్నారు. 

ఐదేళ్లలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. ఇక్కడున్న పైపులను, ఇసుకను, కంకర, రోడ్లు వేసే మెటల్ కూడా దొంగిలించుకుపోయారు. అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదని తెలిపారు. ఓ పక్క హైకోర్టు, మరోపక్క సెక్రెటేరియట్ బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. ఇవన్ని తిరిగిన తరువాత ఇక్కడ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నారు. రోడ్లు అన్ని ఐదేళ్లు ఆగిపోయాయి. బిల్డింగ్ ల కట్టడాలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిని పున: ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకు స్థాపన జరిగిందని తెలిపారు. బిల్డింగ్ లలో ఎక్కువగా తుమ్మ చెట్లు మొలిచిపోయాయని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news