సీఎం పదవీకి అర్హత లేని వ్యక్తి జగన్ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన అమరావతి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా వైసీపీ విధ్వంస పాలన కొనసాగింది. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవీలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశామని గుర్తు చేశారు.
Tel
అమరావతి రాజధాని నగరంలో ఇసుక, కంకర, మట్టి ఇలా అన్నింటిని దొంగిలించారు. రైతులు అమరావతి కోసం 1,631 రోజుల పాటు దీక్ష చేశారని గుర్తు చేశారు. అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలకుతలం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్వ్యం చేశారు. పోలవరం పూర్తి చేసి.. కొంత నదులు అనుసంధానం చేసుంటే రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరందేది అన్నారు. జగన్ పట్ల ప్రజలు అంత వ్యతిరేకతతో ఉండటం వల్లనే కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీ విజయం సాధించిందన్నారు. తెలుగుజాతి గర్వంగా నిలబడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతామన్నారు.