ఆ మంత్రులు ఇంతేనా ? జగన్ బాధ పట్టించుకోరా ?

-

ఎవరు ఎలా అయిపోతే మాకేంటి ? మా స్టైల్ మాదే, మాకు నచ్చినట్టే ఉంటాము. మాకు నచ్చినట్లే చేస్తాము అన్నట్లుగా కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది  మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారాలపై ఎప్పటి నుంచో జగన్ కు ఫిర్యాదులు వస్తూనే ఉండడం, వారిని పిలిచి జగన్ వార్నింగ్ లు ఇవ్వడం, పార్టీ ఇన్చార్జిల ద్వారానూ, వారికి గట్టిగా క్లాస్ పికించడం, ఇలా జగన్ ఎన్నో భరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకపోయినా, రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, బిజెపి పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు  చేస్తుండడం, ప్రభుత్వంలోని చిన్న చిన్న లోపాలను సైతం భూతద్దంలో చూపిస్తూ, ప్రజల ముందు అల్లరి చేయడం వంటి వ్యవహారాలకు పాల్పడుతోంది. వీటి కారణంగా జగన్ ప్రభుత్వం ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా, కేంద్రంలో బిజెపి మద్దతు కావాల్సిందే అనే అభిప్రాయంతో జగన్ అన్నిటిని భరిస్తూ ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి ఎప్పటికప్పుడు తమ పై వ్యతిరేకత లేకుండా వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఏపీకి సంబంధించిన వ్యవహారాల్లో బిజెపి కేంద్ర పెద్దల మద్దతు ఉండేలా చేసుకోగలుగుతిన్నారు. ఇదే సమయంలో కొంత మంది మంత్రుల పనితీరు ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం అవినీతి వ్యవహారాలే కాకుండా, తమకు అప్పగించిన శాఖలను నిర్వహించడంలోనూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలోనూ, తమకు అప్పగించిన శాఖపై పట్టు సాధించే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఫిర్యాదులు అందుతున్నాయి.

దీనికి తోడు కొంతమంది మంత్రులు తమ కార్యాలయాలకు రాకపోవడంతో, చాలా కాలంగా కొన్ని కీలకమైన బిల్లులు పెండింగ్ ఉండిపోయాయి. వీటిపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి  ఉండడంతో ఈ విషయమై చీఫ్ సెక్రటరీ నీలం సహానికి సైతం కొంతమంది అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలు జగన్ వరకు వెళ్లడంతో, ఆయన మరింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని జగన్ సీరియస్ అవుతున్నారట. పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది మంత్రులకు ఫోన్ చేసి మరీ, వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ అక్కడితో సరిపెట్టుకుండా, మొత్తం మంత్రివర్గంలో మంత్రుల పని తీరు, వారి కార్యకలాపాలపైన, సమగ్రంగా ఒక రిపోర్టును ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు సక్రమంగా లేని మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిని ఇంటికి సాగనంపి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని, అవసరమైతే క్యాబినెట్ ప్రక్షాళన చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు బిజెపి, జనసేన పార్టీ లు ఏపీలో వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, అధికార పార్టీ గా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పార్టీని చేజేతులా నాశనం చేసుకుంటున్నాము అనే అభిప్రాయం జనంలో ఉండడంతోనే, అన్ని వ్యవహారాలపైన సీరియస్ గా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news