కృష్ణం రాజు మృతి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..2 ఎకరాల్లో !

-

కృష్ణం రాజు మృతి నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప గో జిల్లాలో కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండు ఏకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

సినీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి సీయం జగన్ మోహన్ రెడ్డి తగిన గుర్తింపు ఇస్తారని ప్రకటించారు. మొగల్తూరు లో పుట్టి సినీరంగం, రాజకీయ రంగంలో కృష్ణం రాజు రాణించడం ఈ ప్రాంత వాసుల అదృష్టం..కృష్ణం రాజు గుర్తుగా తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు.

అటు మంత్రి రోజా మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుంది..కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని తెలిపారు. కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటు..కృష్ణం రాజు – వైఎస్ఆర్ కి మంచి అనుబంధం వుందని గుర్తు చేశారు. భౌతికంగా ఆయన దూరమైన ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరు..కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...