AP RGUKT 2022 : ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలు విడుదల

-

ఆర్జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 77 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే కావడం విశేషం. ఫలితాల్లో సత్తా చాటారు అమ్మాయిలు.

అమ్మాయిలు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల్లో ఉత్తీర్ణత కేవలం 23 శాతం సాధించారు. ప్రవేశ పరీక్షలో 90 శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులే అర్హత పొందారన్నారు బొత్స సత్యనారాయణ.
కనిగిరిలో పూర్తి స్థాయిలో క్యాంపస్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.. రెండేళ్ళ ల్లో ఈ క్యాంపస్ నిర్మాణం చేసి ఒంగోలు నుంచి షిఫ్ట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు క్యాంపస్‌లలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలనే దిశగా కృషి చేస్తున్నామన్నారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news