టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

-

గత రెండేళ్ళు కరోనా కల్లోలం సృష్టించింది..ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు.అయితే పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లి దండ్రులు భయపడ్డారు. దీంతో రెండు సంవత్సరాల పాటు అన్నీ విద్యాసంస్థలు మూత పడ్డాయి.. ఈ ఏడాది పాఠశాలలు మొదలైన సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సిలబస్ ను తగ్గించారు. 70 శాతం మాత్రమే పరీక్షలకు తీసుకుని పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలలో పది, ఇంటర్ పరీక్షలు పూర్తీ అయ్యాయి. ఏపీ లో పది రిజల్ట్స్ ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.

తెలంగాణా లో మాత్రం ఈ నెల ఆఖరున ఫలితాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.. ఇక పోతే ఏపీ లో విడుదల అయిన ఫలితాలు ఆశాజనకంగా లేవు..చాలా మంది ఫెయిల్ అవ్వడంతో సర్కారు కు నిరాశ మిగిలింది.దాంతో ఏపీ సర్కార్ ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ అయ్యేలా అన్నీ చర్యలను తీసుకుంటున్నారు.

ఈ మేరకు పది ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్.. ఈ నెల 13 వ తారీఖు నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తీ అయ్యేవరకు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.జులై లో సప్లిమెంటరీ పరీక్షలు ఉండటం తో ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా రోజుకు రెండు సబ్జెక్టులను భోధించాలని ఉపాద్యాయులకు సూచించింది. ఈ క్లాసుల వల్ల అందరు మంచి మార్కులను పొందుతారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news