ప్ర‌జ‌ల‌కు భోగి మంటలు.. చంద్ర‌బాబుకు కడుపులో మంటలు !

Join Our COmmunity

– టీడీపీవి నీచ రాజకీయాలంటూ ఎమ్మెల్యే రోజా ఫైర్ 

రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు భోగి మంట‌లు వేసుకుంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న కడుపులో మంట‌లు వేసుకుంటున్నార‌ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పండ‌గ వేళ సైతం త‌నదైన‌ స్టైల్‌లో టీడీపీపై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. పండ‌గ సంద‌ర్భంగా త‌న కుటుంబ సభ్యుల‌తో క‌లిసి భోగి మంట‌లు వేశారు. అనంత‌రం చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌డుతూ.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు కోం అనే సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. వీటిని ప్ర‌తిప‌క్ష టీడీపీ త‌ప్పుగా చూపిస్తూ.. ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్న‌ద‌ని అ‌న్నారు.

అయితే, చంద్ర‌బాబు.. త‌మ ప్ర‌భుత్వంపై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసినా ప్ర‌జ‌లు వారిని న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు. రైతుల కోసం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అనేక మంచి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు దిగ‌జారిపోయి మ‌రి గాలి ఆరోప‌ణ‌లు చేడయం ఆయ‌న‌కే చెల్లింద‌ని రోజా అన్నారు. ఇది నీజ రాజ‌కీయాల‌కు ఉదాహ‌ర‌ణ అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేస్తుంటే.. బాబు మాత్రం బుర‌ద జ‌ల్లుతూ.. రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల‌ సమయంలో సీఎం జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చడంతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news