విశాఖపట్నం రాజధానిగా అతి త్వరలోనే ఏర్పడుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. స్దానిక సంస్దలు , పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటు హాక్కును వినియోగించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు… ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి పక్షం దొంగ దిబ్బతీయాలనే కులాల పేరుతో స్దానికసంస్దల ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఇండిపెండెంట్ ను బరిలో ఉంచారని.. ఇది మంచి సాంప్రదాయం కాదని నా అభిప్రాయం అన్నారు.
కులాలు ఎగదోసి , పార్టీల వెనుకుండి , అసమానతలు రెచ్చకొట్టడం చంద్రబాబు కు వెన్నతోపెట్టిన విద్య అని.. ఈ ఎన్నిలతో అయినా బుద్ది చెచ్చుకోవాలని చురకలు అంటించారు. విశాఖ రాజధానిచేయాలని గొప్ప పాలసీ సిఎం జగన్ తీసుకువచ్చారని.. గ్రాడ్యుయేట్స్ వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ది సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ఉండాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. టిడిపి వారు మాకులం వారే బాగుపడాలని లక్ష్యంతో అమరావతి రాజధాని కావాలంటూ కోర్ట్ లకు వెల్లారని..చంద్రబాబు వైఖరిని గ్రాడ్యుయేట్స్ గ్రహించాలన్నారు. గెలవటానికి టిడిపి పోటీచేయటం లేదు. ఎలాగైనా జగన్ మనిషిని ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీసారని.. రెండవ ప్రాధాన్యత విశయంలో ఇతరపార్టీలతో టిడిపి కమ్మక్కుఅయిందని నిప్పులు చెరిగారు మంత్రి సీదిరి అప్పలరాజు.