ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. పేదలందరికీ మంగళగిరి ఎయిమ్స్ లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజిని కీలక ప్రకటన చేశారు.
ఎయిమ్స్‌లో ఇక ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనలకు అనుగుణంగా ఎంవోయూ సేవలు అని, పేదలకు మరింత నాణ్యమైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. అతి త్వరలో పెట్ సిటీ స్కాన్ ప్రారంభం అవుతుందని చెప్పారు రజిని. ఎయిమ్స్ సిబ్బందికి శిక్షణ ఇస్తామని, 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదనంగా ఆరోగ్యమిత్రలను నియమిస్తామని, ఆరోగ్యశ్రీ రోగుల కోసం ఉచితంగా వాహనం సమకూరుస్తామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.