కొత్త కండిషన్: కేటీఆర్ ను పవన్ తిట్టాలంట.. బుల్ బుల్ కబుర్లు కాదు!!

-

ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలకు ఇచ్చే హామీలు, భరోసాల కంటే.. ప్రత్యర్ధులపై చేసే విమర్శలకే విలువెక్కువైపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇలాంటి అలవాటుకు అలవాటుచేశారని ఒక టాక్! ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో దుబ్బక ఉప ఎన్నిక అనంతరం జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందడి మొదలుకాబోతోంది! ఈ క్రమంలో… పవన్ ను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారంట!

అవును… పవన్ సేవలు పుష్కలంగా వాడుకోవాలని, భాగ్యనగరంలో ఉన్న ఆంధ్రుల ఓట్లను ప్రభావింతం చేయాలని భావిస్తున్నారంట  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్! ఈ విషయంలో బండి సంజయ్ చాలా పట్టుదలగా ఉన్నారని.. పవన్ సేవలు వీర్రాజు ఎలాగూ ఉపయోగించుకోవడం లేదని భావించారో లేక ఎలాగూ హైదరాబాద్ లోనే ఉంటున్నారని అనుకున్నారో తెలియదు కానీ.. సంజయ్ అయితే ఫిక్సయ్యారంట!

ఇందులో భాగంగా… కాంగ్రెస్ నాయకుల సంగతి కాసేపు పక్కనపెడితే… హైదరాబద్ ఎన్నికల్లో తెరాసను ఫుల్ గా విమర్శించాలని, అంతకుమించి కేటీఆర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని. పవన్ చేసే ప్రతీ విమర్శా కేటీఆర్ ను ఇరుకునపెట్టేదిగా ఉండాలని బండి సూచిస్తున్నారంట! అది కచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు! ఏదో వచ్చాము.. “బుల్ బుల్” కబుర్లు చెప్పామన్నట్లు కాకుండా, బలమైన ప్రభావవంతమైన ప్రచారం చేయాలని ఆశిస్తున్నారంట బండి!

మరి పవన్ కల్యాణ్ ఈ కండిషన్ కు ఒప్పుకుంటారా.. ఏదో గ్లామర్ కోసం వచ్చి పోమంటే వచ్చి రెండు డైలాగులేసి, నాలుగుసార్లు జుట్టు పైకి అనుకుని వెళ్లమంటే ఓకే కానీ… ఇలా కేటీఆర్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాలంటే తనవల్ల కాదని సైడ్ అయిపోతారా అన్నది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news