AP : స్కూళ్లు, కాలేజీలకు రెండ్రోజులు సెలవులు.. క్లారిటీ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలో మరియు కళాశాలలో ఇవాళ అలాగే రేపు అంటే రెండు రోజులపాటు సెలవులు ఉన్నట్లు నిన్నటి నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇవాళ రేపు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారనే ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొంతమంది.

ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసనలు చేపడుతున్నాయని… దాని కారణంగానే ప్రభుత్వం స్కూలు మరియు కాలేజీలకు సెలవులు ఇచ్చింది అనేది ఈ వార్త సారాంశం. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారం అని… స్కూలు మరియు కాలేజీలు ఇవాళ మరియు రేపు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. విద్యార్థులు యధావిధిగా పాఠశాలలకు వెళ్లాలని కోరింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version