Borugadda Anil: గుంటూరులో బోరుగడ్డ అనిల్ అరెస్ట్..షాక్ లో వైసీపీ!

-

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గుంటూరులో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడు. గుంటూరు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్ కుమార్‌ ఉన్నారు. 2021 లో ఏఎల్ సి చర్చి ల ట్రెజరర్ , కర్లపూడి బాబు ప్రకాష్ ను బెదిరించి 50 లక్షలు తీసుకున్న కేసులో అరెస్ట్‌ అయ్యారట. అలాగే… ఏఎల్సి ఆస్తులు తనకు రాశి ఇవ్వాలని బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అరెస్టు చేయశారట పోలీసులు.

Borugadda Anil Arrested

గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బోరుగడ్డ అనిల్ కుమార్. గుంటూరుతో పాటు పలు జిల్లాలలోని పోలీస్ స్టేషన్లలో బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసులు నమోదు అయినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు బోరుగడ్డ అనిల్ కుమార్. అయితే నిన్న రాత్రి గుంటూరులో బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న పోలీసులు…విచారణ చేస్తున్నారు. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version