పోలవరం విషయంలో తెలంగాణకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నాడు – బొత్స

పోలవరం విషయంలో తెలంగాణకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ విషయాన్ని అయినా క్షుణ్ణం గా అర్ధం చేసుకుని మాట్లాడాలని.. మీడియాలో వచ్చిన వార్తలు చూసి మాట్లాడితే ఎలా?? అని నిలదీశారు. ప్రైవేటు స్కూల్స్‌ను పుస్తకాల డిమాండ్ గురించి ముందే అడిగామని.. వాళ్ళ డిమాండ్ లో 20 శాతం మాత్రమే చెప్పారన్నారు.

ప్రభుత్వం కఠినంగా ఉందని అర్ధం అయిన తర్వాత ఇప్పుడు ఇంకా పుస్తకాలు కావాలని అడుగుతున్నారని.. చంద్రబాబు మాటలు చూస్తే ప్రజలు నవ్విపోతారని చురకలు అంటించారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వరద సహాయం గురించి మాట్లాడుతున్నాడు… చంద్రబాబుకు పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాకుండా ఉండాలని ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు చీకట్లో చేస్తున్నవి కాదని.. ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈడీ విచారణ వేయమనటానికి చంద్రబాబుకు బుద్ధి ఉందా?? రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవటానికి చంద్రబాబే కారణమన్నారు.