ఈటల రాజేందర్…టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది..రోజుకో స్టేట్మెంట్ తో కారు పార్టీలో సంచలనం సృష్టిస్తున్నారు. తనకు ఉన్న పాత పరిచయాలతో టీఆర్ఎస్ నేతలని బీజేపీకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. చేరికల కమిటీ కన్వీనర్ అయిన దగ్గర నుంచి టీఆర్ఎస్ టార్గెట్ గానే ఈటల రాజకీయం ఉంటుంది. పదే పదే గజ్వేల్ లో పోటీ చేస్తా…కేసీఆర్ ని ఓడిస్తానని చెబుతూ..టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.
అదే సమయంలో టీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పి…కారు నేతల్లో కలవరం పెంచుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయని, టీఆర్ఎస్ లోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లో ఉన్నారని ఈటల బాంబ్ పేల్చారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే ఈటల ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమే..కేసీఆర్ ని దెబ్బకొట్టడమే ఈటల లక్ష్యం. అందుకే ఆ పార్టీపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పైగా కేసీఆర్ పై తనకు లాగా తిరుగుబాటు చేసే నేతలు ఉన్నారని, కాకపోతే వారు నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆలోచించి వెనుకడుగు వేస్తున్నారని, కానీ సమయం చూసుకుని వారు బీజేపీలోకి వచ్చేస్తారని అంటున్నారు.
ఇక ఈటల వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో టెన్షన్ పెంచుతుంది…అసలు జంప్ అయ్యే నేతలు ఎవరు అని పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ జంపింగ్ నేతలు బయటపడుతున్నట్లు లేరు…వారు సైలెంట్ గానే ఉంటూ పనిచేసుకుంటున్నారు. దీంతో జంప్ అయ్యే నేతలు ఎవరో తెలియక టీఆర్ఎస్ అధిష్టానం సతమతమవుతుంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాక్ ఇచ్చి…బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీని ఈటల షేక్ చేస్తున్నారు.