ఏప్రిల్‌ నెలలోనే విశాఖకు రాజధాని తరలింపు : మంత్రి బొత్స

ఏప్రిల్‌ నెలలోనే విశాఖకు రాజధాని తరలింపు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు మంత్రి బొత్స సత్య నారాయణ. తాజాగా బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ నెలలోనే రాజధాని విశాఖపట్నానికి తరలి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నారు.

ఈ సమయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని మార్చవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ కమిషనరేట్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉంది. దీన్ని విజయవాడ బస్టాండ్ సమీపంలోని భవనంలోకి మార్చాలని ప్రతిపాదించారు. ఏప్రిల్ నెలలోనే విశాఖకు వెళ్లిపోదామంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.