ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఎక్కడ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు.
ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఆయన బిజెపిలో చేరనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. కీలక పదవి ఇస్తామనే హామీ తోనే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.