ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా 2800 కోట్లు విడుదల చేసింది కేంద్ర సర్కార్. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన తర్వాత… ఈ ప్రకటన రావడంతో ఆయన కృషి వల్లే పోలవరం నిధులు విడుదలయ్యాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలవరం రియంబర్స్మెంట్ కింద 800 కోట్లు అలాగే అడ్వాన్స్గా 2000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తోలుతా సొంత నిధులతో పనులు చేయిస్తే… వాడికి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న సంగతి మనందరికీ విధితమే. అయితే ప్రస్తుతం.. ఆర్థిక సంవత్సరంలో 6000 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే ఏడాది కోసం 6157కోట్ల మంజూరుకు కూడా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా పోలవరానికి 2500 కోట్లు విడుదల చేసి… ఏపీని ఆదుకుంది కేంద్ర ప్రభుత్వం.