బాబు వీళ్ల‌కు ఇంత బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడేంటి…!

-

అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు చంద్రబాబు బాగా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పుడు లేని విధంగా పార్టీలో పదవుల పంపకాలు చేపట్టారు. అసలు మునుపెన్నడూ లేని విధంగా టీడీపీలో పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా అధ్యక్షులని కూడా పెట్టారు. ఇక తాజాగా పార్టీలో ఉన్న కీలక పదవులని భర్తీ చేశారు.ఈ పదవుల పంపకాల్లో చంద్రబాబు కంచుకోట లాంటి కృష్ణాజిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు. మామూలుగా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా కావడంతో ఇక్కడ టీడీపీకి మంచి పట్టుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి ఇక్కడ మంచి ఫలితాలు వచ్చేవి.

కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 16 సీట్లలో రెండు మాత్రమే గెలిచింది. రెండు ఎంపీ సీట్లలో ఒకటి గెలుచుకుంది. దీంతో ఓడిపోయిన దగ్గర నుంచి కృష్ణాలో టీడీపీ పుంజుకోవడమే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి ఇష్యూ టీడీపీకి బాగా కలిసొస్తుంది. అలాగే పలువురు నేతలు పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇదే సమయంలో కృష్ణాలో టీడీపీకి మంచి ఊపు తెచ్చేందుకు బాబు, జిల్లాకు పలు కీలక పదవులు కట్టబెట్టారు.

పార్టీలో అత్యంత కీలమైన పొలిట్‌బ్యూరోలోకి జిల్లాకు చెందిన బోండా ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్యలని తీసుకున్నారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో వర్ల రామయ్యకు చోటు కల్పించారు. ఇక కీలకమైన రాజకీయ కార్యదర్శి పదవి టీడీ జనార్ధన్‌కు ఇచ్చారు. అలాగే అధికార ప్రతినిధులుగా జిల్లాకు చెందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పర్చూరు అశోక్ బాబులని పెట్టారు. కోశాధికారి పదవి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు ఇచ్చారు. అలాగే క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పదవి బచ్చుల అర్జునుడుకు ఇచ్చారు. ఇలా పార్టీలో కీలక పదవుకు కృష్ణా జిల్లాకు చెందిన నేతలకు అప్పజెప్పారు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news