ఇప్పటికే రాజధాని రైతులు ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడలకు బలైపోతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నప్పటికీ… వారి నుంచి స్పందన రావడంలేదు. దానికి కారణం… అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండదని జగన్ కచ్చితంగా చెబుతున్నప్పటికీ… బాబుకి ఆ వాస్తవం తెలిసినప్పటికీ… ఇంకా రాజధాని రైతులను ఏమార్చే పనికి పూనుకోవడమే.. వారిని నమ్మించే ప్రయత్నాలు చేయడమే.. ఫలితంగా మరికొన్ని రోజులు రాజకీయంగా లబ్ధి పొంద ప్రయత్నించడమే!
అమరావతిలోనే రాజధాని ఉండాలనే రాజధాని రైతుల కోరికను, ఆశను క్యాష్ చేసుకునే పనిలో భాగంగానో.. లేక వారిని ఇంకా ఏమార్చే పనిలో భాగంగానో తెలియదు కానీ… వైజాగ్ పాలనా రాజధాని వద్దంటూ చంద్రబాబు సంతకాల సేకరణ చేయిస్తున్నారంట. విచిత్రం ఏమిటంటే… అది కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగా చేయించ తలుస్తున్నారంట! అసలు ఉత్తరాంధ్ర ఇప్పటికీ ఎలా వెనుకబడి ఉందనే విషయం అందరూ ఒప్పుకునేదే. ఇంతకాలం పరిపాలించిన చంద్రబాబు కూడా ఆ విషయాన్ని స్వయంగా ప్రస్థావించే విషయమే. పరోక్షంగా ఇంతకాలం వారు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పడమే.
ఈ క్రమంలో… ఉత్తరాంధ్ర అభివృద్ధికి తొలి అడుగుగా చెబుతున్న పాలనా వికేంద్రీకరణలో భాగంగా… విశాఖకు పాలనా రాజధాని వెళ్లడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు వద్దంటారు. రాజధానికోసం భూములిచ్చిన ప్రాంత ప్రజలు మినహా… మిగిలిన జిల్లాల ప్రజలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తపరుస్తారు! అయినా కూడా బాబు సంతకాల సేకరణ చేపట్టబోతున్నారు! ఫలితంగా… నేరం నాది కాదు ప్రజలదే అనే సంకేతాలు రాజధాని రైతులకు ఇవ్వనున్నారన్నమాట!!
నేను మీకోసమే గట్టిగా పోరాడాను.. కానీ మిగిలిన ప్రాంత ప్రజలు మాత్రం అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలన్న విషయాన్ని బలపరచలేదని.. కాబట్టి తానుకూడా ఏమీ చేయలేనని చెప్పి తప్పించుకోబోతున్నారని.. తదనుగుణంగా పథకాలు రచించారని.. అందులో భాగంగానే ఈ సంతకాల సేకరణ అని అంటున్నారు విశ్లేషకులు!!