టీడీపీ.. తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది : చంద్రబాబు

-

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుజాతికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

- Advertisement -

మరోవైపు తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా, రాజకీయ చైతన్యానికి సంకేతంగా టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు పూర్తయిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్వీట్‌ చేశారు. బడుగు బలహీనవర్గాలకు టీడీపీ భరోసాగా నిలిచిందని.. మహిళల స్వావలంబనకు చేయూత అందించిందని పేర్కొన్నారు. ‘‘నేను తెలుగువాడినని సంతోషిస్తాను.. తెలుగుదేశం వాడినని గర్విస్తాను’’ అని లోకేశ్‌ ట్విటర్ వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...