భద్రాచలం శ్రీరాములవారిని దర్శించుకున్న చంద్రబాబు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ముంపు బాధితులని పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు.ప్రధాన ఆలయంలో స్వామివారి మూలవిరాట్ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు.చంద్రబాబుకు స్వామివారి ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు,వేదపండితులు.చంద్రబాబుతో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం ఆయన భద్రాచలం ఎమ్మెల్యేను కూడా కలిశారు.

 

అంతకుముందు బూర్గంపహాడ్ మండలంలోని వరద ముంపు బాధితులను పరామర్శించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుందని పేర్కొన్నారు చంద్రబాబు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఉండే పార్టీ తెలుగుదేశం అని.. తెలుగుదేశం ఆవిర్భావమే తెలంగాణ లోని హైదరాబాద్ లో జరిగిందని వెల్లడించారు.యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ లోనూ తెలుగుదేశం ఉండాలని.. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని.. ఇక్కడి వారిని చూస్తుంటే తెలంగాణ తో పాత అనుభవాలు గుర్తుకొస్తున్నాయని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news