చంద్రబాబు ఇంటి కాపలా కుక్కను పెట్టి కొడాలి నానిని ఓడిస్తాం: కొల్లు రవీంద్ర

-

గుడివాడలో తెలుగుదేశం మహానాడు నేపథ్యంలో టిడిపి నేతలకు, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కి మధ్య మాటల యుద్ధం రాజుకుంది. గుడివాడ లో టిడిపి బహిరంగ సభ అనగానే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయని, చంద్రబాబు అంటేనే భయపడుతున్నారు అని బుద్ధా వెంకన్న విమర్శించారు. దీని పై కొడాలి నాని కూడా ధీటుగానే స్పందించారు. చంద్రబాబు నన్ను ఓడించడం కాదు, వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనే గెలుస్తాడో, లేదో చూసుకోవాలని అన్నారు.

దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు అవసరం లేదన్నారు. చంద్రబాబు ఇంటి కాపలా కుక్కని పెట్టి కొడాలి నానిని ఓడిస్తామని అన్నారు. కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. గుడివాడ నుంచి నానిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news