విజయసాయి షాక్.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక బాధ్యతలు ?

-

ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీలో కీలకమైన 23 అనుబంధ సంఘాలను చెవిరెడ్డి రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. అంటే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది.

దీంతో విజయసాయికి ప్రాధాన్యత తగ్గనుంది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా సంఘాలను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయనున్నారు.గతంలో పార్టీ అప్పగించిన పెనుగొండ మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్, ఆత్మకూరు, బద్వేల్ ఎన్నికలు, ఇలా ఎన్నింటినో ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. వీటితోపాటు పార్టీ ప్లీనరీ నుంచి ఇటీవల వైజాగ్ లో ప్రధాని మోదీ పర్యటన వరకు ఆయా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్సిపి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news