BREAKING : ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాసేపటి క్రితమే పల్నాడు జిల్లా వినుకొండకు సీఎం జగన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం అందజేశారు.
దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల చొప్పున సాయం చేశారు ఏపీ సీఎం జగన్. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఇక ఈ పథకం కారణంగా ఏపీ వ్యాప్తంగా 3.30లక్షల మందికి లబ్ధి చేకూరింది.
ఇక అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసగించారు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు సీఎం జగన్. ప్రతి పక్షాలకు ఓటేసినప్పటికీ.. తాము సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా, పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. నవరత్నాల ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు.. ఈ మూడే ళ్ల కాలంలో రూ.927 కోట్లు లబ్ధిదారులకు అందించామని ప్రకటన చేశారు సీఎం జగన్.