ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ. 1,213 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.

శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం భేటీ కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎలికెమ్, ఇజ్రాయెల్ కి చెందిన నియోలింక్, జపాన్ కి చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్ కి చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఇఎస్ఎస్ఏవై, ఎవరైన్, జేజీఐ, త్రినాథ్, జెన్ నిన్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన ఎనికే సీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్కు చెందిన ఏజీ అండ్ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఈ, సింగపూర్లతో పాటు మనదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version