ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బుడగ జంగాలు, వాల్మీకి, బెంతో ఒరియా, ఏ నేటి కొండా సామాజిక వర్గాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోయినా వైయస్సార్ చేయూత పథకానికి అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. దరఖాస్తు తో సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే చాలని స్పష్టం చేసింది. క్యాస్ట్ సర్టిఫికెట్ జారీలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల కు ఏడాదికి 18750 ఇస్తున్నారు.