రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి రేపు ఉదయం సీఎం జగన్ 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి 12:55 వరకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.