ఆక్వా రంగంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం ఎగుమతులు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని.. ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచేనని.. సింగిల్ డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్ త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కాగా.. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం జరుగనుంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ నేతృత్వంలో దావోస్ వెళ్లనుంది ఏపీ బృందం… సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన, గుడివాడ, ఎంపీ మిధున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. దావోస్ సదస్సుకు చెందిన కర్టెన్ రైజర్ బ్రౌచర్ విడుదల చేశారు మంత్రి గుడివాడ అమర్నాధ్.